ట్రాక్టర్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షుడిగా కల్లూరి రాజయ్య
సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 11, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తిమ్మాయపల్లి గ్రామంలో బుధవారం ట్రాక్టర్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని యూనియన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడిగా కల్లూరి రాజయ్య, ఉపాధ్యక్షుడిగా అవుశేర్ల హరీష్, కోశాధికారిగా దానవే ని పోచయ్య ని ఏన్నుకోవడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మా మీద నమ్మకంతో మాకు ఈ యొక్క పదవులను అప్పగించిన ట్రాక్టర్ యూనియన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ట్రాక్టర్ యూనియన్ సభ్యులకి అందుబాటులో కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.





