మంచిర్యాల జిల్లా.
టిపిసిసి అధ్యక్షులు ,ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు.
మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు.
SC వర్గీకరణ బిల్లు మరియు BC రిజర్వేషన్ బిల్లు 42 శాతం అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ.
ఈరోజు మంచిర్యాల కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, మిఠాయిలు పంపిణీ చేసి, టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, SC,BC నాయకులు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.





