ముస్తాబాద్, ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 24, ఇంటింటికి బిజెపి మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ పట్టణంలో ప్రధాని మోదీ 9 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన పలు అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలపై ప్రతిఇంటి గడప గడపకు తిరిగి ప్రజల దగ్గరకువెళ్లి కరపత్రాలు పంచుతూ 9090902024 కు మిస్డ్ కాల్ ఇప్పించి అవగాహన కల్పించారు… ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనేమేని చక్రధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మెంగని మహేందర్, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మీసా సంజీవ్, పాక్స్ డైరెక్టర్స్ ఏళ్ళ గిరిధర్ రెడ్డి, మిరుదొడ్డి దేవయ్య, కామిటికారి పద్మ, మీసా శంకర్, ఎదునూరి గోపి, పెంజర్ల కళ్యాణ్, సత్తయ్య, బండి శ్రీకాంత్, ఉపేంద్ర, పప్పుల శ్రీకాంత్, మీసా స్వామి, ఓరుగంటి సత్యం, శీల భాను, మీసా శ్రీనివాస్, కరుణాకర్, జక్కుల సంజీవ్, కొల్లూరి ఎల్లవ్వ తదితరులు పాల్గొన్నారు.
