ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్ల పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్త భర్కూటీ ఎల్లవ్వ రోడ్డు ప్రమాదంలో 18 నెలల క్రితం మరణించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలకు రెండు లక్షల ప్రమాద భీమా పథకం ప్రవేశ పెట్టి సభ్యత్వ నమోదు కు ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోరుట్ల పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేయించుకున్న ఎల్లవ్వ రోడ్డు ప్రమాదంలో మరణించింది.ఈ సందర్భంగా ఆమే భర్త మల్లయ్య కు కుమారుడు సతీష్ కు రెండు లక్షల రూపాయల ప్రమాదభీమా పథకం చెక్కు ను కెకె మహేందర్ రెడ్డి శనివారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చక్రధర్ రెడ్డి,సర్పంచ్ మేడిపల్లి దేవానందం , పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మేడిపల్లి రవీందర్ , నాయకులు గూడా నారాయణరెడ్డి, పద్మారెడ్డి, ఎగదండి చంద్రయ్య , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి , బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, పాతూరి భూపాల్ రెడ్డి బండారి బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
