కేంద్ర బిజెపి ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న రైతు వ్యతీరేక చట్టాలకు యసంగి లో తెలంగాణ రాష్ట్రంలో వడ్లు కొనమని చెప్పినందుకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 12వ తేదీన టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి రైతులందరూ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలి రావాలని ఎల్లారెడ్డిపేట టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బండారి బాల్ రెడ్డి. ఎల్లారెడ్డిపేట సింగిల్విండో అధ్యక్షులు గుండారపు కృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు .
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నీ టిఆర్ఎస్ పార్టీ ( జడ్పీటీసీ ) కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యంగా యసంగి లో వడ్లు కొనమని చెప్పినందుకు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 12వ తేదీ న నిర్వహించ తలపెట్టిన రైతుల ధర్నా కార్యక్రమానికి రైతులందరూ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కదిలి రావాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
కరీంనగర్ పార్లమెంటు సభ్యులైన బండి సంజయ్ ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి కి వచ్చిన సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆద్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వడ్ల కొనుగోళ్ళ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమీటనీ ప్రశ్నించడానికి తాము సిద్దంకాగా ఎంపి రూట్ మార్చాడని తాం విలేఖరుల సమావేశంలో మాట్లాడగా బిజెపి పార్టీ కి చెందిన ఓ గల్లీ కి చెందిన లీడర్ ఇష్టం వచ్చినట్లు వాగాడనీ బంగారు తెలంగాణ నిర్మాత ముఖ్యమంత్రి కెసిఆర్ ను విమర్షిస్తూ మాట్లాడినాడనీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి నీది కాదని టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రసిడెంట్ బండారి బాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.ప్రెస్ మీట్ లో ఏది మాట్లాడాలో ఏది మాట్లాడొద్దో తెలియనీ నీవు పద్దతి మార్చుకోవాలనీ ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు నంది కిషన్. నేవూరి జగన్ రెడ్డి .మీసం రాజం. నేవూరి నవజీవన్ రెడ్డి.ఎలగందుల నర్సింహులు.బొల్లు భూమయ్య యాదవ్. టిఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ ఎడ్ల లక్ష్మణ్. టిఆర్ఎస్ పార్టీ మండల మహిళా సంఘం అధ్యక్షురాలు మహమ్మద్ అప్సర్ ఉన్నీషా అజ్జు .టౌన్ యూత్ ప్రసిడెంట్ దొనుకుల కళ్యాణ్. యూత్ నాయకులు గడ్డం వెంకటేష్ లింగాల శ్రవణ్ . మంగారపు వెంకటేష్.ఈసరి వినోద్. కిరణ్ తదితరులు పాల్గొన్నారు.