కాంగ్రెస్ పార్టీలో చేరిన టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు జి మల్లేష్
సంగారెడ్డి 05 ఏప్రిల్
టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుడు జి మల్లేశం డిసిసి అధ్యక్షురాలు మరియు టీ జి ఎల్ ఎల్ సి చైర్మన్ శ్రీ నిర్మల జయప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీలో గత 20 సంవత్సరాలుగా కష్టపడి పని చేసిన ఉద్యమకారున్ని గుర్తించని పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ యొక్క పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఏర్దనూరు గ్రామం నుంచి ఎవ్వరు కూడ జెండా పట్టుకోవడానికి ముందుకు రాణి దిక్కులేని సమయంలో మేము ముందుండి తెలంగాణ కోసం పోరాడి తెచ్చుకుంటే ఇప్పటివరకు ఆ యొక్క పార్టీలో మమ్మల్ని ఎగతాళి చేసిన పెత్తనం చేస్తుంటే ఆ పార్టీలో ఇంకెన్నాళ్లు ఉండగలం.
ఏలా ఓర్చుకోగలం ఏనాడు కూడా ఉద్యమకారులను గుర్తించని కేసీఆర్ ఇప్పుడు గుర్తిస్తాడు అన్న నమ్మకం మాకు లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పటికైనా ఉద్యమకారులారా టిఆర్ఎస్ పార్టీలో మనకు ఎలాంటి గుర్తింపు లేనప్పుడు మనం ఆ పార్టీలో ఉండడం అంత మంచిది కాదు కాబట్టి ఇంకా మిగతా ఉద్యమకారులు గిటా వచ్చి మన కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందిగా నా యొక్క విన్నపం అని తెలియజేశారు
