ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 20, మండల కేంద్రంలో నూతన గ్రంథాలయ భవనం ప్రారంభోత్సవం… ఎంపీడీవో రమాదేవి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య చేతుల మీదుగా గ్రంథాలయాలయంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ గ్రంథాలయంవల్ల విజ్ఞానం పెరుగుతుందని గ్రంథాలయం ఎంతో పురోగతి సాధిస్తూ ఎంతో ఆనందకరమని అన్నారు. గ్రంథాలయాలను గత మూడు నాలుగు వేల సంవత్సరాల నుంచే ఉపయోగించుకొనే వారని దీనివల్ల ఒకరితో ఒకరు చర్చించుకోవడం కూడా జరిగేదన్నారు. నేటి సమాజం ఎప్పటికప్పుడు దినపత్రికలలో ప్రచురించిన వ్యవసాయం, వైద్యం, పారిశ్రామికం, సంఘసంస్కరణలు అనే అంశాలపై వార్తలు, రచనలు, వ్యాసాలు విషయం తెలుసుకుంటూ అదేవిధంగా ఒక్కపుస్తకం వంద మంది గొప్ప వ్యక్తులతో సమానమని వారన్నారు. ఈఏర్పాటుకు సహకరించిన గ్రామసర్పంచ్ గాండ్ల సుమతి మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయానికి జిల్లాకలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినందుకు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఆకునూరి శంకరయ్య చేతుల మీదుగా ప్రారంభోత్సవం కావడం ఆనందదాయమని అన్నారు. ఈకార్యక్రమంలో జెడ్పిటిసి ఉండడం నరసయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, జిల్లా కో ఆప్షన్ సర్వర్ ఫాష, మండల కో ఆప్షన్ సాదుల్ పాప, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొండ శ్రీనివాస్ గౌడ్, ఎంపిటిసి కంచం మంజుల నర్సింలు, నందు రెడ్డి, చెవుల మల్లేష్ యాదవ్, అన్వర్, గూడూరి భరత్, వార్డు మెంబర్లు, మహిళలు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
