ప్రాంతీయం

జర్నలిస్టులపై పోలీసుల దాడి అమానుషం

108 Views

ఓయూలో జర్నలిస్టులపై పోలీసుల దాడి అమానుషం.

టి జె యు జిల్లా అధ్యక్షులు

ఎం డి. షానూర్

యాదాద్రి భువనగిరి జిల్లా ,

జులై 11

హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో డీఎస్సీ వాయిదా వెయ్యాలని నిరుద్యోగ యువకులు ఆందోళన చేస్తుంటే దానిని న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన జీ తెలుగు న్యూస్ జర్నలిస్టు శ్రీచరణ్ ను పోలీసులు వ్యవహరించే తీరును దారుణమని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ అన్నారు .

విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను తాము జర్నలిస్టులమని చెబుతున్నా పోలీసులు దురుసుగా వ్యవహరించి, వారిని బలవంతంగా లాక్కొని పోలీస్ వాహనంలో ఎక్కించి పోలీసు స్టేషన్లో నిర్బంధించడం మీడియా భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని తెలిపారు.

ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులపై ఇలాంటి దౌర్జన్యాలు జరగకుండా అరికట్టేందుకు ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి చొరవచూపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ ఖాజఫసివుద్దీన్ , జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టికొప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్