ప్రాంతీయం

అవమానం మాకు.. అభిమానం మీకా.. భూమిపూజ అయేనా …

404 Views

ముస్తాబాద్, సెప్టెంబర్ మండల అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి 30,పడకల ఆసుపత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గురించీ కేటీఆర్ మండలానికి వచ్చినప్పుడల్లా ఇతర హామీల గురించి మంత్రికి ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం లేనందున మండల కాంగ్రెస్ నాయకులు ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, ఆరుట్ల మహేష్ రెడ్డి, తాళ్ల విజయరెడ్డి, రంజాన్ నరేష్, అమర నిరాహార దీక్ష నాడు చేపట్టారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, గతంలోని సంఘీభావం తెలిపిన విషయం విధితమే, నాడు దీక్షను ఉద్దేశించి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి ఎలక్షన్ల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చి మరిచిపోయారని ఇచ్చిన హామీలు గుర్తుచేద్దామని వెళ్తే మా కార్యకర్తలు వెళితే ప్రతిపక్ష నాయకులని హౌజ్ అరెస్టులు చేసుకుంటూ ఒక్కొక్కరి పై నేటి వరకు ఎన్నో కేసులు నమోదు చేయించారని కాంగ్రెస్ నాయకులను అనుగా తొక్కేయాలని నేపంతో కక్ష సాధింపు చర్యలు చేపట్టారని అన్నారు. 2014,2018 ఇచ్చిన హామీలు 9.సం.రాలకు గుర్తొచ్చిందా అన్నారు. నేడు ముస్తాబాద్ మండలానికి 30 పడకల ఆసుపత్రి కేవలం ఎలక్షన్లు సమీపిస్తుందని ఉద్దేశంతో మంజూరు చేయించారు. 30,పడకల ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల గురించి చర్చిస్తే కేసులు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు.. అభిమానములు బిఆర్ఎస్ పార్టీకా ఎట్టకేలకు 9 సంవత్సరాలకు మాత్యాగఫలం ఫలించింది కానీ 9 సం, నుండి ఎన్ని కేసులు అయినా ఎన్ని అరెస్టులైనా పోలీసులతో బాధలు భరించాం ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ వెనువెంటనే భూమి పూజచేసి మొదలు పెట్టాలని కోరుతున్నాంమన్నారు. లేనియెడల మళ్లీ ధర్నాకార్యక్రమం ప్రారంభిస్తామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు, ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తలారి నర్సింలు, మండల సోషల్ మీడియా కన్వీనర్ ఎదునూరి భానుచందర్, సీనియర్ నాయకులు ఉచ్చిడి బాల్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *