మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి:
రైతు రుణమాఫీకి షరతులు ఎందుకు? అన్నదాతల ఆశలపై కాంగ్రెస్ నీళ్లు
బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్
గోలేటి గ్రామపంచాయతీ దుగ్గపూర్ గ్రామంలో రైతులతో కలిసి పంటలను పరిశీలించిన బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలో రావడానికి అందరికీ రైతు రుణమాఫీ చేస్తామని అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీకి భిన్నంగా ఇప్పుడు షరతులు ఎందుకు పెట్టారో సీఎం రేవంత్రెడ్డి రుణమాఫీకి ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ పథకాన్ని ప్రకటించడమంటే లక్షల మంది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమేనంటూ “రుణమాఫీ పథకం అమలుపై ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను చూస్తే రైతుల కష్టాల కంటే రుణ మాఫీ రైతు అర్హులను తగ్గించడానికి ఎక్కువ దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో రైతు ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరో మాట. చెప్పేది ఒకటి చేసేది ఒకటనే విధానం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. 2018 డిసెంబరు 12కు ముందున్న రైతులకు మాఫీ వర్తించదనే నిబంధన అసమంజసం. రుణమాఫీకి రేషన్ కార్డుతో లింకు పెట్టడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని స్పష్టం చేశారు “బ్యాంకర్లు చేసిన తప్పులకు నిరక్షరాస్యులైన రైతులను ఇబ్బంది పెడుతు న్నారు. గత పది ఏళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డు నిబంధన పెట్టడం సరికాదు. కంటి తుడుపు చర్యగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డు ఆధారంగా తీసుకోమని చెబుతున్నప్పటికీ జీవోలో మాత్రం స్పష్టంగా రేషన్ కార్డు అనేది తప్పనిసరి చేయడం తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా పెట్టడంతో చాలా మంది రైతులు నష్టపోతారని. ఇప్పటికీ ధరణి భూ సమస్యలతో రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ తీవ్రంగా నష్టపోతున్నారు రైతుబంధు ఇవ్వని ప్రభుత్వం కాంగ్రెస్ మోసాలకు భవిష్యత్తులో రైతుల గుణపాఠం చెబుతారని రైతులందరికీ రుణ మాఫీ చేయాలని జిల్లా వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు కార్యక్రమంలో మడవి జంగు కుడిమెత పైకు. మడవి దిగంబర్ పాల్గొన్నారు.





