ప్రాంతీయం

అక్రమంగా రవాణా చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం

52 Views

అనుమతిలేకుండా మూగజీవాలను అక్రమంగా రవాణా చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం

జిల్లా సరిహద్దు గుండా పశువుల అక్రమ రవాణాను కట్టడి చేయడానికి జిల్లాలో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు,

అక్రమంగా పశువులు తరలిస్తున్నట్లు సమాచారం ఉన్నచో స్థానిక పోలీసులకు లేదా డయల్ 100, సిద్దిపేట కమిషనరేట్ పోలీస్ కంట్రోల్ రూమ్ 8712667100 సమాచారం అందించాలి

పోలీస్ కమిషనర్ బి. అనురాధ, ఐపీఎస్

సిద్దిపేట జిల్లా జూన్ 8

సిద్దిపేట్ ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ

ఎవరైనా అనుమతులు లేకుండా పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు దృష్టికి వస్తే సంబంధిత పోలీసులకు, లేదా కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలే తప్ప, స్వయంగా వెళ్లి అక్రమంగా అడ్డుకోనీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని గొడవలు సృష్టించినట్లయితే అట్టి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని ఒక బాధ్యత గల పౌరునిగా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

రాబోవు బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమంగా పశువులను రవాణా చేసే అవకాశం ఉన్నందున, పోలీసులు, పశుసంవర్ధక శాఖ అధికారుల సమన్వయంతో ఆరు చెక్ పోస్ట్ నిర్వహించి ఎలాంటి అక్రమ తరలింపునకు పాల్పడకుండా ముందస్తుగా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించడానికి పోలీసు యంత్రాంగం ముందస్తు ప్రణాళికలతో కార్యచరణ సిద్దం చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లా సరిహద్దు వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి సరిహద్దులతో పాటు జిల్లా అంతటా ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రధాన పశువుల సంతలో పశువుల రవాణాకు కావాల్సిన అనుమతి పత్రాలు తనిఖీలు నిర్వహించి, అనుమతులు లేని వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వధశాలకు అనుమతి లేని పశువులను, దూడలు,గోవులను అక్రమంగా రవాణా చేయడం చట్టరీత్యా నేరమని పశువుల వ్యాపారులు.

ఈ సున్నితమైన అంశాన్ని గమనించాలన్నారు. పశువులను ఒకచోట నుండి మరొక చోటికి తరలించడానికి పశువైద్యాధికారి ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా వెంట ఉండాలన్నారు, పశువుల సంతలో కొనుగోలు చేసిన పశువులను తీసుకొని వెళుతున్నట్లయితే వాటిని అమ్మినా వివరాలు, సంబంధిత పశువైద్యాధికారి ధ్రువీకరించిన రవాణాకు అనుమతి పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.

రవాణా చేస్తున్న సమయంలో పశువులకు ఎలాంటి హాని తలపెట్టిన, హింసించిన అట్టి వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు బక్రీద్ పండుగ సందర్బంగా ప్రజలు చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు, సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పోలీసు, పశువైద్య డాక్టర్లచే వాహనాల తనిఖీలు చేపట్టి పకడ్బందీ చర్యలు తీసుకుంటారని తెలిపారు, పండగలు పూర్తయ్యేవరకు అదనంగా పెట్రోలింగ్ వాహనాలను మోహరించి జిల్లా అంతటా నిఘా పెట్టినట్లు తెలిపారు,

ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని జిల్లా యంత్రాంగం తో కలిసి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు పోలీసుల సలహాలు సూచనలు పాటించి శాంతిభద్రతలకు సహకరించాలని కమిషనర్ సూచించారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్