445 Views

ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 15, తెలంగాణ స్టేట్ బీడీ కార్మిక సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చిలువేరు కిష్టయ్య విలేకర్లతో మాట్లాడుచు, బీడీ కార్మికులకు నెలకు 26. రోజులు పని కల్పించాలి, కార్మికులకు 2016/- జీవన భృతి పి. ఎఫ్. ఉన్న కారికులకు అందరికి వర్తించాలి, బీడీ కార్మికులకు చేతినిండా కల్పించాలి, తెలంగాణలో 10. లక్షల మంది బీడీ కార్మికులు ఉంటే రెండు లక్షల మందికి మాత్రమే జీవన భృతి ఇస్తున్నారు. అందరికి వర్తించాలి లేనిచో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. బిడి పెన్షన్ టెకదార్లకు కూడా వర్తించాలి 2018 వ సంవత్సరం కామారెడ్డి బారి బహిరంగ సభలో కెసిఆర్ బీడీ పెన్షన్ అందరికి ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. కానీ ఇప్పటికి అమలు కాలేదు అన్నారు. బీడీ కార్మికులకు మరియు టేకదార్లకు జీవన భృతి అందరికీ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో బిఎంఎస్ జిల్లా అధ్యక్షడు తోట ధర్మేందర్, బీడీ కార్మిక సంఘ్ జిల్లా అద్యక్షుడు వల్లాల చంద్రమౌళి, లత, ప్రమీల, సువర్ణ, రామానుజన్, బాబి మరియు బీడీ ప్యాకర్లు కార్మికులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found