ప్రాంతీయం

పాములపర్తి గ్రామంలో ప్రజా పాలన  గ్రామసభ కార్యక్రమం

55 Views

పాములపర్తి గ్రామంలో ప్రజా పాలన  గ్రామసభ కార్యక్రమం

సిద్దిపేట జిల్లా మర్కుక్  జనవరి 22

సిద్దిపేట జిల్లా,మర్కుక్ మండలం,పాములపర్తి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి ఆధ్వర్వంలో ప్రజా పాలనలో భాగంగా గ్రామసభ నిర్వహించడం జరిగింది. అనంతరం తిర్మల్ రెడ్డి మాట్లాడుతూ,ఈ కార్యక్రమంలో రైతు బరోసా,ఇందిరమ్మ ఇళ్లు ,రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ బరోసా పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని,కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతుందని ,హర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కనకయ్య గౌడ , గ్రామ అధ్యక్షుడు క్రాంతి కుమార్, యంఆర్ఓ ఆరిఫా ,ఎంపీడీఓ, ఆర్ఐ , గ్రామ కార్యదర్శి ప్రవీణ్, ఉపసర్పంచ్ పద్మనర్సింలు , చెక్కల మల్లేశ్ ,రాజయ్య ,మల్లారెడ్డి ,లక్ష్మణ్,నాగరాజు ,స్వామి, మహేష్, వేణు, గ్రామ యూత్ అధ్యక్షుడు బాలకృష్ణ , ములుగు పరశురాం , కొండనోళ్ల నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్