ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే 6, చికోడు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సమయపాలన పాటించడం లేదు. గ్రామపంచాయతీకి సరిగా రావడంలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఏవైనా సమస్యలు చెప్పుకుందామంటే తీర్చే నాధుడే కరువయ్యాడంటూ గ్రామస్తులు వాపోతున్నారు. ముస్తాబాద్ మండలం చీకోడ్ గ్రామపంచాయతీ కార్యదర్శి బాలకిషన్ సమయపాలన పాటించకపోగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను తీర్చక పోగా కనీసం గ్రామపంచాయతీకి సహితం సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. సమస్య చెప్పుకుందాం అనే భావనతో గ్రామస్తులు పంచాయతీకి ఆఫీసుకు వస్తే కార్యదర్శి లేక వేను తిరిగిపోతున్నారు. నూతనంగా గృహ నిర్మానుల వారికి సెట్ బ్యాక్ వదలకుండా పర్మిషన్ ఇస్తున్నారని తెలిపారు. చీకోడు గ్రామస్థులు సెక్రెటరీ ఉదయం 12 గంటలకే డ్యూటీ ముగించుకొని డోర్ క్లోజ్ చేసి వెలుతున్నట్లు ప్రాథమిక సమాచారాన్ని అందించారు. కనీసం డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ప్రజల సమస్యలపై శ్రద్ద వహించడం లేదని పలువురు వాపోయారు. గంటలు తరబడి వేచి ఉన్న కార్యదర్శి పట్టించుకోవడం లేదన్నారు. పంచాయతీ కార్యదర్శి పై వివరణ కోరెందుకు పై అధికారులకు చరవాణి ద్వారా వివరణ కోరగా మరో అధికారిని వివరణ తీసుకోవాలని తెలిపారు. పై అధికారులను అడగగా సరైన సమాధానం లేక ఫోన్ కట్ చేశారు.ఈవిధంగా సంబంధిత అధికారులు సమయపాలన పాటించకుండానే విధుల నుంచి వెళ్లిపోవడం పట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి నేరుగా ఫోన్ చేసి అడగగా నేను మా ఊరికి అన్నం తినడానికి వెళ్ళానని అసందర్భ సమాధానం ఇచ్చారు. ప్రతీ రోజు ఇదే తంతని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు . సంబంధిత అధికారులు ఇప్పటికయిన ఇటువంటి వారిపై దృష్టి పెట్టాలని గ్రామప్రజలు పై అధికారులని కోరారు.
