జిల్లా లో నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న ట్రాక్టర్లకు చెక్
*గత మూడు రోజులుగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 513 ట్రాక్టర్స్/ట్ర్యాలీ గుర్తింపు.
*ఇక పై నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్ల పై తిరిగే ట్రాక్టర్స్ పై చీటింగ్ కేసులు నమోదు.
*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 9, జిల్లాలో రిజిస్ట్రేషన్ నంబర్, నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న ట్రాక్టర్స్, ట్ర్యాలీలపై గత నాలుగు రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 513 వాహనాలను గుర్తించి అట్టి వాహనాదారులకు జరిమాన విధించి ట్రాక్టర్స్ డ్రైవర్స్ కి అవగాహన కల్పించి నెంబర్ ప్లేట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అని, ఇకపై నెంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపిన నంబర్ ప్లేట్ దాచినా లేదా కొన్ని నంబర్లు తొలగించినా ఛీటింగ్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ట్రాక్టర్స్ డ్రైవర్స్ ఇష్ట రీతిన ట్రాక్టర్స్ / ట్ర్యాలీ లు నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారని, వీరికి చెక్ పెట్టడానికి జిల్లాలో గత నాలుగు రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 513 వాహనాలు గుర్తించి జరిమానాలు విధించడంతో పాటుగా అట్టి వాహనాలకు నెంబర్ ప్లెట్స్ ఏర్పాటు చేసి ఇకపై నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్ల పై తిరుగుతే చీటింగ్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడం జరిగిందన్నారు.
ట్రాక్టర్స్ డ్రైవర్స్ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించలని, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిత్యం తనిఖీలు నిరహిస్తామని, ఇష్ట రీతిన ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వేగంగా నడుపుతూ తోటి వాహదారులకు,ప్రజలకు, పాదాచారులను భయబ్రాంతులకు గురి చేసిన, మైనర్ డ్రైవింగ్ చేసిన, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండ వాహనం నడిపిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలను పాటించకుండా వాహనాలు నడుపుతూ పోలీసులు విధిస్తున్న ఈ-చాలానాల బారి నుండి తప్పించుకునేందు తమ వాహనాలకు సంబందించిన నెంబర్ ప్లేట్ కి బదులు వేరే నెంబర్ ప్లేట్లను అమర్చి వాడినట్లైతే అలాంటివారిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకొని వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.జిల్లా పరిదిలోని ప్రజలు అందరు పోలీస్ వారికీ సహకరించలని, తమ వాహనాల నెంబర్ ప్లేట్స్ నిబందనల ప్రకారం బిగించు కోవాలని నిబందనలకు విరుద్దంగా నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసి వాహనం నడిపితే వాహనదారుడిపై ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని అన్నారు.
జరిమానాలు విధించడం మా ఉద్దేశం కాదని, ప్రజల్లో ట్రాఫిక్ రోడ్డు నియమ నిబంధనలు పాటించేలా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.
