ముస్తాబాద్ మార్చ్ 9, మాజీ టిఆర్ఎస్ నాయకుడు కనమేని చక్రదర్ రెడ్డి కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, స్వామి వివేకానంద విగ్రహాలకి పూలమాల వేసి అనంతరం భారీ ఎత్తున టపాకాయలు కాల్చారు. కమలం గూటికి చేరెందుకు ముస్తాబాద్ నుండి హైదరాబాద్ కు 300 పైచిలుకు కార్యకర్తలతో బయలుదేరారు. టిఆర్ఎస్ పార్టీలో గట్టి పట్టున్న నేతగా పేరున్న కనమేని గత కొంతకాలంగా ఏమైందో ఏమో కానీ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈమధ్య ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం కాగా భారతీయ జనతా పార్టీలో చేరుతారని ప్రచారం కావడంతో ప్రజల్లో రసభసలు నెలకొని ఒక్కసారిగా రాజకీయ వర్గాలలో చర్చలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు సైతం ఆయనతో సంప్రదింపులు జరిపారు. బిజెపి సీనియర్ నేతలు ఎంపీలు బండి సంజయ్ కుమార్, వివేక్ భారతీయ జనతా పార్టీలోనికి స్వాగతం పలికారు. చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా టిఆర్ఎస్ లో పనిచేస్తున్న నేను ఆ పార్టీని వీడి భారతీయ జనతాపార్టీ నరేంద్ర మోడీ భారతదేశంలో ఒక ఉన్నత స్థానంలోకి తీసుకుపోతూ ఉన్న తరుణంలో యువత యువకులు బిజెపి పార్టీలోని చేరడానికి 500 మంది సంసిద్ధంగా ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీలో ఉండడం నాకు ఇష్టంలేక ఎంపీ బండి సంజయ్ కుమార్, వివేక్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరుకుంటున్నానని రాబోయే రోజుల్లో భారతీయ జనతాపార్టీలోనికి చేరడానికి ఇరు పార్టీలవారు అధిక సంఖ్యలో సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కస్తూరి కార్తికరెడ్డితోపాటు పలు మండలాల బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
