ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 8, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవం పురస్కరించుకొని ముస్తాబాద్ మండలంతో మొదలుకొని పలు గ్రామాలలో గ్రామపంచాయతీ నుండి ఎంతో భక్తిశ్రద్ధలతో మహిళలు బోనాలను కట్ట మైసమ్మ చెరువు కట్టపైనకు తీసుకెళ్ళి గురువారం చెరువుల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు చెరువు పాటలు సహా చెరువుమీద ఇతర కవులు రాసిన పాటలను మత్స్యకారుల వలల ఊరేగింపులతో ఘనంగా చెరువు కట్టలపై సభలు నిర్వహించారు. కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచ్ లు
తో మమేకమైన ప్రజాప్రతినిధులు మహిళలు అధికారులు, గ్రామస్తులు కలిసి చెరువు కట్టమీద సహపంక్తి భోజనాలు చేశారు.



