ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 8, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవం పురస్కరించుకొని ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో బోనాలు కట్ట మైసమ్మ దరికి చేరాలని బోనాలతో వెళ్లగా వింత సంఘటన చోటుచేసుకుంది ఆమైసమ్మ ఓఅవ్వకు పూనకంతో ఏర్పడి ప్రజలను ఆపి యాటపిల్ల కోరింది అయినా ప్రజలు వినిపించుకోకుండా కోడిని కోస్తామంటూ ముందు దూసుకెళ్లారు ప్రజలు చెరువు కట్టపైనకు తీసుకెళ్ళి గురువారం చెరువుల పండగ నిర్వహించారు. ఈసందర్భంగా డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు బతుకమ్మ ఆట ఆడారు. చెరువుమీద మత్స్యకారుల వలల ఊరేగింపులతో ఘనంగా చెరువు కట్టలపై నృత్యాలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు, గ్రామస్తులు కలిసి చెరువు దగ్గర సహపంక్తి భోజనాలు చేశారు.
