ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 7, అంబేద్కర్ యువజన (మాల) సంఘము నూతన అధ్యక్షునిగా ఎన్నికైన మీసాస్వామి వారి కార్యవర్గాన్ని బిజెపి రాష్ట్ర నాయకుడు కనమేని చక్రధర్ రెడ్డి, ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మీసాస్వామి మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించి ఏకగ్రీవంగా ఎన్నుకున్న కుల పెద్దలకు, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులందికీ నాహృదయపూర్వక జై భీమ్ లు తెలిపారు. ప్రపంచ విశ్వమేధావి డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు కొనసాగిస్తానని
అలాగే యూత్ సభ్యులందరు ఏకమై మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ మనమంతా ఇలాగే ఐక్యంగా ముందుకువెళ్తూ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగస్తులమై ముందుకు కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు, సీనియర్ బిజెపి లగిశెట్టి శ్రీనివాస్, జిల్లా నాయకులు మల్లారపు సంతోష్ రెడ్డి, మీసా సంజీవ్, మీసా శంకర్, మరియు మండల నాయకులు టౌన్ ప్రెసిడెంట్ మెంగని మహేందర్, అంజగౌడ్, ఏళ్ల గిరిధర్ రెడ్డి, బండి శ్రీకాంత్, వరి వెంకటేష్, ఉపేంద్ర, పెంజర్ల కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.




