ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 6, పోతుగల్ సహకార సంఘం పరిధిలోని బందనకల్ గ్రామంలోని వరిధాన్యం కోనుగోలు కేంద్రంలో ఎట్టకేలకు వడివడిగా పూర్తిచేశారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తి చేయాలన్న సంకల్పంతో అధికార యంత్రాంగం అడుగులు వేసింది ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కొనుగోళ్లను వేగవంతం చేశారు. ముందే రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం ఇప్పటివరకు దాదాపు మెజార్టీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సిరిసిల్ల జిల్లాలో సైతం ముస్తాబాద్ మండలంలో మొదటగా తుర్కపల్లే పూర్తి చేసకుంది. గ్రామంలో అకాల వర్షాలకు రైతులు కొంతవరకు నష్టపోగా ఇదే సమయంలో అవసరమైన గన్నీ బ్యాగులు, కాంటాలు, తేమ యంత్రాలు, ఇతర సామగ్రిని సైతం అందజేశారు. మరోవైపు ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించేలా ట్రాన్స్‌పోర్టు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద మాజీ ఏఎంసి డైరెక్టర్ చిగురు నరేష్, ఎంపీటీసీ రామచంద్రారెడ్డి, మాట్లాడుతూ ఇందుకు సహకరించిన మాపై అధికారులకు హామాలీలకు గ్రామ రైతులకు ధన్యవాదాలు తెలిపారు.
