ప్రాంతీయం

బెల్లంపల్లిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభం

59 Views

*అంగరంగ వైభవంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం. ప్రారంభోత్సవం*

బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వచించిన ఎమ్మెల్యే పుణ్య దంపతులు గడ్డం రమ గడ్డం వినోద్ వెంకట్ స్వామి.

ఈసందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్  మాట్లాడుతూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

నియోజకవర్గ అభివృద్ధి కి పాటుపడతానని ఎమ్మెల్యే వినోద్ గారు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం వెచ్చించిన నిధుల వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు 920 మందికి కల్యాణ లక్ష్మీ పథకం కింద రూ 9 కోట్లా 26 లక్షలు,244 మందికు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ 65 లక్షల 61 వేళా చెక్కుల ను అదించమనట్లు తెలిపారు.

ఎన్ ఆర్ ఈ జి ఎస్ పథకం కింద 194 పనులకు గాను రూ 8 కోట్ల నిధులను ఖర్చు చేశామన్నారు.ప్రత్యేక అభివృద్ధి పథకం కింద రూ1.5 కొట్లతో త్రాగునీటి పథకానికి రూ,రెండు కోట్ల తో పాఠశాలల అభివృద్ధి ని చేపట్టామన్నారు,రూ 7 కోట్ల 40 లక్షల నిధులను అమ్మ ఆదర్శ పాఠశాలలకు వినియోగించమన్నారు.

డిఎం ఎఫ్టి పథకం కింద రూ 9 కోట్ల నిధులను బీటీ, సీసీ రోడ్ల నిర్మాణానికి ఖర్చు చేశామని రూ,23 కోట్ల 30 లక్షల నిధులతో బెల్లంపల్లి మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులను చేపట్టామన్నారు.

ఇప్పటి వరకు రూ,100 కోట్ల నిధులను బెల్లంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పథకాలకు ఖర్చు పెట్టడం జరిగిందని వెల్లడించారు.

బెల్లంపల్లి చిరకాల కోరిక అయిన ఎల్లంపల్లి నుండి బెల్లంపల్లి కి రక్షిత త్రాగునీరు అందించేందుకు రూ,430కోట్ల తో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు,బెల్లంపల్లి ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాలతో పాటు నెన్నెల,తాండూరు మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు కు నిధులను మంజూరు చేపిస్తున్నారు

త్వరలో నే బెల్లంపల్లి బస్సు డిపో వచ్చేలా కృషి చేస్తన్నారు.

డంపు యార్డ్ కోసం స్థలాన్ని ఎంపిక చేయడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీ గోడల నిర్మాణం,మరుగుదొడ్ల నిర్మాణానికి రూ 30 కోట్ల అంచనా నిధులతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు.

రూ2 కోట్ల సీఎస్ ఆర్పథకం కింద రూ 5 కోట్ల తో ఎస్టీ ఏ ఫ్ నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయనికి శాశ్వత రహదారి సౌకర్యన్ని ఆరు నెలల్లోగా కల్పిస్తానని హామీ ఇచ్చారు.

సింగరేణి యాజమాన్యంతో చర్చించి ఏరియా ఆసుపత్రిని పరిరక్షించేందుకు పాటుపడతానని 100 పడకల ప్రభుత్వ వైద్యులతో పాటు సిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకుంటానని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అందుబాటులో ఉంటూ ప్రజాపాలన అందిస్తామని ఎమ్మెల్యే గడ్డం వినోద్  తెలిపారు.

నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అందుబాటులో ఉంటూ ప్రజాపాలన అందిస్తామని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామన్నారు.

కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి గారి దంపతులను శాలువతో సన్మానించారు ఈరోజు రాఖి పౌర్ణమి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఆడపడుచులు ఎమ్మెల్యే గారికి రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , కౌన్సిలర్లు వివిధ విభాగాల అధ్యక్షులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్