మంచిర్యాల జిల్లా.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ.
మంచిర్యాల ఐబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ.
ఈ ర్యాలీ మాజీ దేశ సైనికుల కవాతు మధ్య ర్యాలీ కొనసాగింది.
అనంతరం వీర మరణం పొందిన ఇండియన్ ఆర్మీ జవాన్ ఎం. మురళి నాయక్ చిత్ర పటానికి నివాళులు అర్పించి, ఏప్రిల్ 22వ తేదీన పహల్గం ఉగ్రవాదుల వాడిలో అమరులైన పౌరులకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ.
బెల్లంపల్లి చౌరస్తాలో కళాకారులతో దేశ భక్తి గీతాలు ఆలాపన నిర్వహించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ గార్లు మాట్లాడుతూ ప్రాణులకు సైతం పోరాడిన ఆర్మీ జవాన్లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
అనంతరం మాజీ దేశ సైనికులను శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, విద్యార్థి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
