జై భీం!
ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ వర్గల్ మండల కమిటీల బలోపేతంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం లోని తుంఖి ఖల్సా గ్రామంలో మండల అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఇఆర్ మోహన్ , జిల్లా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ హాజరు అయి మండల కమిటీ పూర్తి స్థాయిలో పటిష్టం చేయాలని దిశ నిర్దేశం చేశారు.అదే విదంగాఈ సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్ , నియోజకవర్గ ఉపాధ్యక్షులు గుర్రం ఎల్లం , ప్రధాన కార్యదర్శి మొండి కర్ణాకర్ , గ్రామ అధ్యక్షులు వినయ్, దేవేందర్, భిక్షపతి పలువురు గ్రామ నాయకులు పాల్గొన్నారు.
తుంఖి ఖల్సా గ్రామ శివాలయం నుండి డా”అంబెడ్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి పులామాల వేసి అంబెడ్కర్ రాసిన రాజ్యాంగ లోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ సాదించుకుని 10 సం”లు గడిచినగానీ తెలంగాణ అమరుల కలలు ఇంకా నెరవేరలేదు. కానీ ఈ కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నాటి సురక్ష దినోత్సవాన్ని బహిష్కరిస్కరించాలని, మరియు తెలంగాణ లో శాంతి భద్రత లు అదుపులో లేవని, అడ్డగుడూరు పోలీస్ స్టేషన్లో దళిత మరియమ్మ చావు, సిరిసిల్ల లో నెరేళ్ల ఘటన, మెదక్ లో ఖాధిర్ఖాన్, చిరంజీవి లు పోలీసుల చేతుల్లో అన్యాయంగా మరణించడం ఇందుకు సాక్షాలు,అదే విదంగా 2009౼12 బ్యాచ్ ఎస్సై ఎందుకు ప్రమోషన్స్ ,ఇంక్రిమెంట్స్, డి. ఏ లు ఎందుకు సరైన సమయంలో ఇవ్వడం లేదు, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా పోలీసులు పనిచేయడం లేదని అలాంటప్పుడు ఏ విదంగా సురక్షా దినోత్సవాన్ని జరుపుతారని జిల్లా అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు మోహన్ , ప్రకాష్ ప్రశ్నించడం జరిగింది.అదేవిదంగా కేసీఆర్ నియంతృత్వ పాలనను గద్దె దించి బహుజన రాజ్యం కోసం స్థాపించాలని అన్నారు.