సి.ఎం. కప్ గ్రామస్థాయి ఎంపికల నమోదు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి హనుమంత రెడ్డి.
మంచిర్యాల జిల్లా, జనవరి 5, 2026:
సి.ఎం. కప్ తెలంగాణ- 2025 (2వ ఎడిషన్) కొరకు గ్రామస్థాయి ఎంపికల నమోదు ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి హనుమంత రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని విభాగాల క్రీడాకారులు గ్రామస్థాయి ఎంపికల కోసం తప్పనిసరిగా ఆన్ లైన్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. https://satg.telangana.gov.in/cmcup/ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆసక్తి గల క్రీడాకారులు తక్షణమే తమ వివరాలు నమోదు చేసుకోవాలని, ఇతర వివరాల కొరకు 9963539234 నంబర్ లో సంప్రదించవచ్చని తెలిపారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





