శనివారం అత్యవసర సమయంలో రక్త దానం చేసి మానవత్వాన్ని చాటిన సిద్దిపేట రూరల్ కానిస్టేబుల్ రాజు
సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 13, ( తెలుగు న్యూస్ 24/7)
మలుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా ఆపరేషన్ సమయంలో,బి పాజిటివ్, బ్లడ్ అవసరము ఉన్నదని పోలీస్ మిత్రులు ద్వారా సమాచారం తెలుసుకున్న,సిద్దిపేట రూరల్ కానిస్టేబుల్ రాజు, వెంటనే స్పందించి సిద్దిపేట ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ వెళ్లి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న అతని యొక్క కుటుంబ సభ్యులు అత్యవసర సమయంలో బ్లడ్ డొనేట్ చేసిన కానిస్టేబుల్ కు కృతజ్ఞతలు తెలిపారు.





