ప్రాంతీయం

నేటి సమాజంలో మహిళలు ఆర్థికంగా బలపడి, గౌరవంగా జీవించాలి – డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి – డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు

140 Views

మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో రాణిస్తూ విద్య, వైద్య, ఉద్యొగ రంగాలలో ప్రతిభను కనబరుస్తూ ముందుకెల్లాలని బుధవారం గజ్వేల్ లో టి వై ఆర్ ఫౌండేషన్ లో దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించిన సందర్భంగా డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి మహిళలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఏగొండ స్వామి మాట్లాడుతూ మహిళలకు పనిగంటలు తగ్గించాలని, మెరుగైన జీవితం కొసం,ఓటు వేసే హక్కు కొసం 1910 సంవత్సరంలో కోహెన్ హెగెన్ నగరంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సదస్సు నందు క్లారా జెట్కిన్ అనే మహిళ పొరాట స్పూర్తిని గుర్తిస్తూ ఈ మహిళ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, లింగ సమానత్వం కొసం, పక్షపాత దొరణి, మూస దొరణిలకు వ్యతిరేకంగా కొట్లాడం కొసం మహిళ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్యసమితి సైతం మహిళ దినోత్సవాన్ని గుర్తించడం ప్రపంచవ్యాప్తంగా మహిళ దినోత్సవాన్ని జరుపుకుంటున్నమన్నారు.

ప్రస్తుత కాలంలో విద్య, వైద్య, రాజకీయ రంగాలలో మహిళలు రాణిస్తున్నందున వారిపై ఇంకా లైంగిక హింస కొనసాగుతూనే ఉన్నది ఇటువంటి వివక్షల వలన మహిళలు అనుకున్నంతగా రాణించలేకపొతున్నరన్నారు.

నిన్నటికి నిన్న వైద్య వృత్తిలో బలహీన వర్గాలకు చెందిన ప్రితి పై లైంగిక హింస హెచ్చుమిరటం వలను ఏ విధంగా నేలరాలిందో చూసమన్నారు. కాబట్టి మహిళలు సమాజంలో జరుగుతున్న వివక్షతలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వారు అనుకున్నది సాదించాలన్నారు. కరోన సమయంలో వైద్య రంగంలో విశేష సేవలందించినా ఆశా వర్కర్లు రాసమల్ల అరుందతి, పిట్ల లావణ్య ఆదర్శ మహిళ రైతు కాశమైన శ్యామల, ఉపాధి హమీ కూలీ చింతకింది సుగుణకు వారి సేవలను గుర్తిస్తూ సన్మానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జిల్లా ప్రధన కార్యదర్శి బ్యాగరి వేణు, విశ్వజన కళామండలి ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మాచపురం బాలనర్సయ్య, సామాజిక కర్యకర్త సాదక్ పాషా విద్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *