ప్రాంతీయం

ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు. బిజెపి మద్దతుతోనే తెలంగాణ…

371 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి,జూన్ 2,  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్  చెర్లపెళ్లి రజిత సుధాకర్ రెడ్డీలు, ఉపసర్పంచ్ గున్నాలనాగరాజుగౌడ్  ఆరోవార్డు మెంబర్ ఊరెడిరాజు జెండా ఆవిష్కరించి జెండా వందనంచేసి జాతీయగీతం ఆలపించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిందని ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడానికి ముందుకు వస్తే తెలంగాణకు చిన్నమ్మగా మారిన స్వర్గీయ సుష్మా స్వరాజ్ సంపూర్ణ మద్దతు తెలిపారని ఆమద్దతుతోనే తెలంగాణ ఏర్పడిందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిటిసి, కార్యదర్శి రాజు, ఫీల్డ్ అసిస్టెంట్ కనకయ్య, ఆశా వర్కర్లు, సిఏలు చీకోడు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *