ప్రాంతీయం

ఓర్వలేకనే అనవసరమైన ఆరోపణలు. సర్పంచ్ …

419 Views

 

 

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 26, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్పంచ్ గాండ్ల సుమతి భర్త ఈవిషయమై వివరణ ఇస్తూ కొందరు వ్యక్తులు కావాలని దురుద్దేశంతో రాజకీయ లబ్ధికోసం నాపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. ఇందులో తన భర్తపేరుమీద నిర్మాణ పనులు జరుగుతుండగా సెట్ బ్యాక్ లేకుండా అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పంచాయతీ అనుమతితో నిర్మాణ పనులు చేపడుతుంటే అక్రమ నిర్మాణాలంటూ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సర్పంచ్ అన్నారు. కొందరుపార్టీ నేతలు సైతం పట్టణానికి సంబంధంలేనివారుకూడా ఈ విషయంలో తలదూర్చి అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే నిర్మిస్తున్నాను తప్ప ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టడంలేదని సంబంధిత పత్రాలను చూపిస్తున్నట్లు గాండ్ల సుమతి తెలిపారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *