వ్యవసాయ రంగం పురోగతి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురుంచి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. ఆదివారం పద్మనాయక ఫంక్షన్ హాలులో రైతు అవగాహన సదస్సు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ వ్యవసాయ, బ్యాంకు, హార్టికల్చర్,ఉద్యానవన, కృషి విజ్ఞాన కేంద్రం, పశుసంవర్ధక అధికారులు, రైతులను ఉద్దేశించి మాట్లాడారు. బ్యాంకు అధికారులు రుణాల కోసం వచ్చే రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు.
నవీన పద్ధతులు నేర్చుకోవాలి.ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.
మంచిర్యాల నియోజకవర్గంలోని రైతులు మూడు పంటలు వేసే దిశగా ఆలోచన చేయాలని అందుకు అధికారులు సహకారం, ప్రోత్సహం అందించాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. సాగునీరు అందుబాటులో ఉన్నందున రైతులు వరి, కూరగాయలు ఇతర లాభాల పంటలు వేసి ఆర్ధికంగా ఎదగాలని ఆయన కోరారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూరగాయలు మంచిర్యాల కు దిగుమతి అవుతున్నాయని అన్నారు. ఈప్రాంతంలో కూరగాయలు పండిస్తే లాభసాటి గా ఉంటుందని తెలిపారు. అలాగే పాడి పంటలు వృద్ధి చేయాలని సూచించారు. పాడి ద్వారా పాలఉత్పత్తి పెంచాలని ఆయన కోరారు. రైతుల కు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని అన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి తన లక్ష్యమని అన్నారు. సదస్సులో రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన సందర్శించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్,లీడ్ బాంక్ రీజినల్ మేనేజర్ అపర్ణ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, బీజేపీ సీనియర్ నాయకుడు గొనె శ్యామ్ సుందర్ రావు,నాయకులు బొడ్డు శంకర్ పాల్గొన్నారు.
