వర్గల్ మండల్ కేంద్రంలోని, వేలూరు గ్రామంలో,శుక్రవారం డి ఎం సి ఎస్ రైతు సేవ కేంద్రం ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి చేతులమీదుగా ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు జీలుగా విత్తనాలను 65% సబ్సిడీతో అందిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని రైతులు తమ పంట పొలంలో జీలుగు విత్తనాలు చల్లుకొని రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని సూచించారు. ఈ సందర్భంలో వ్యవసాయ అధికారిని శేషనాయన మాట్లాడుతూ పచ్చి రొట్టె ఎరువుల వాడకం వలన రసాయన ఎరువులు వినియోగం తగ్గించవచ్చని, జీలుగు విత్తనాలు వరి కోతల తర్వాత ఒక తడి ఇచ్చి పొలంలో వెదజల్లిన తర్వాత 45 రోజుల తర్వాత, పూత దశకి ముందు పొలంలో కలియ దున్నడం ద్వారా భూమిలో నత్రజని శాతం పెరిగి భూమి సారవంతం అవుతుందని సూచించారు. ఒక బస్తా 30 కిలోల విత్తనం కి రైతు చెల్లించవలసిన ధర ఎనిమిది వందల నలభై రూపాయలు మరియు ఈ విత్తనం 2.20 ఎకరాలకు సరిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బాలు యాదవ్, ఎంపీపీ లతా రమేష్ గౌడ్, పి ఏ సి ఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, వేలురు సర్పంచ్ పాపిరెడ్డి, సీనియర్ నాయకులు నాగరాజు, ఏ ఈ ఓ క్రాంతి కుమార్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
