Breaking News

చేనేత, హస్తకళల మేళా

113 Views

గ్రామీణ చేనేత, హస్తకళల మేళా ను: ప్రారంభించనున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

హైదరాబాద్:అక్టోబర్ 06

సెర్ప్, దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి చేనేత, హస్తకళల సరస్ మేళా కొనసాగనున్నది.

నెక్లెస్ రోడ్‌లోని హెచ్‌డిఎంఎ మైదానంలో శుక్రవారం ఈ ప్రదర్శనను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించనున్నారు.

సరస్ మేళాలో ఆదిలాబాద్ డోక్రా, లోహపు బొమ్మలు, పోచంపల్లె ఇక్కత్ చీర్లు, గద్వాల్ పట్టు చీరెల్లు, భద్రాచలం వెదురు బొమ్మలు, అగర్‌బత్తీలు, హెర్బల్ ఉత్పత్తులు, జనగాం మసాలా దినుసులు, ఆసిఫాబాద్ గిరిజన హస్తకళాకృత్యలు, సిరిసిల్ల చేనేత ఉత్పత్తులు, నిర్మల్ పెయింటింగ్స్‌తో పాటు దేశంలోని 19 రాష్ట్రాలలోని స్వయం సహాయక సభ్యుల చేనేత, హస్తకళల సంబంధించిన దాదాపు 300 స్టాళ్లు ఏర్పాటు చేశారు.

ఈ ప్రదర్శన 6వ తేదీ నుంచి 16వ తేది వరకు కొనసాగనున్నది…

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *