గూడూరు నియోజకవర్గం వాకాడు మండల జర్నలిస్ట్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం
స్థానిక స్వర్ణముఖి అతిథిగృహంలో గూడూరు డివిజన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వాకాడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులుగా కె. సుధాకర్, ఉపాధ్యక్షులుగా మనోహర్, రియాజ్, ప్రధాన కార్యదర్శిగా ఈ. సురేష్, సంయుక్త కార్యదర్శులుగా ఇస్మాయిల్, బాబు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా పౌల్ రాజ్, పెంచలయ్య, సహాయ కార్యదర్శిగా పోలయ్య, కోశాధికారిగా గురవయ్యలతోపాటు కార్యవర్గ సభ్యులుగా సిరాజ్, రేవంత్, ముని రంగ, కె. బాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని గూడురు డివిజన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్, కన్వీనర్లు మీజూరు మల్లికార్జున్ రావు, గుంజాపల్లి బాబూ మోహన్ దాస్, రఘు, శివ కుమార్, గూడూరు ప్రింట్ మీడియా అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ జమాలుల్లా, ఉడతా శరత్ యాదవ్, ఉపాధ్యక్షుడు పరుచూరు బాలకృష్ణ, సవరపు కిషోర్ నాయుడు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాకాడు మండల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
