ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి
మే25, మండలంలో సెట్ బ్యాక్ వదిలిపెట్టకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గత రెండు మూడు నెలల నుండి అక్రమ నిర్మాణాలు చేస్తున్న నేపథ్యంలో ముస్తాబాద్ లోని వార్డు సభ్యుడు బుర్ర రాములు గౌడ్ దీక్ష చేసి ఉపేందర్ గౌడ్ టవర్ఎక్కి వారి నిరసనలు తెలిపారు. పార్టీలకతీతంగా ప్రజలు యువత ఆందోళన బాట పడుతున్నారని ఓరగంటి తిరుపతి తెలిపాడు. మెయిన్ రోడ్ నుండి శివకేశవ ఆలయాలకు వెళ్లే దారిలో అక్రమ నిర్మాణం పై మేజర్ గ్రామపంచాయతీ విఫలం అయ్యిందని ఈసందర్భంగా తూర్పు భాగంలో గతంలో నిర్మించిన పార్వతి శ్రీధర్, కళావతి గృహ నిర్మాణ అనుమతుల పత్రాన్ని ఇవ్వాలని కోరామని సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు పంచాయతీ కార్యదర్శికి అందించారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఓరగంట తిరుపతి, వార్డు సభ్యులు బుర్ర రాములు గౌడ్, మెంగని మహేందర్ జిల్లెల్ల ఉపేందర్ పాల్గొన్నారు.
