ప్రాంతీయం

మహేందర్ కు అండగా ఉంటాం మెరుగైన వైద్యం కోసం ఆదేశించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు

117 Views


తొగుట; విద్యుత్ షాక్ మూలంగా ప్రమాదానికి గురైన బండారు పల్లికి చెందిన బుచ్చక్క మహేందర్ కు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అండగా నిలుస్తున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న మహేందర్ ను సర్పంచ్ లు కుంభం శారదా రఘోత్తమ్ రెడ్డి, బొడ్డు నర్సింలు తో కలిసి పరామర్శించారు..ప్రమాదం జరిగిన వెంటనే ఎంపీ గారు స్పందించి ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీ విద్యుత్ హెల్పర్ గా అందరితో కలువు గోలుపుగా ఉండే మహేందర్ కు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమన్నారు. మహేందర్ కు మెరుగైన వైద్యం తో పాటు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని ఎంపీ గారు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.. పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు మంగ నర్సింలు, ధనుంజయ తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *