ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే22, అప్పర్ మానేరు కెనాల్ ని లోతుచెరువు మల్లారెడ్డి పేట్ నుంచి రత్నాలకుంట ముస్తాబాద్ వరకు ఇంజనీరింగ్ అధికారి కరీంనగర్ బి.శంకర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అమరేందర్ రెడ్డి ముస్తాబాద్ ఇరిగేషన్ డిఈఈ రవికుమార్ మరియు వంశీకృష్ణ ఏఈఈ స్రవంతి ఏఈఈ సందర్శించారు. ఇందులో భాగంగా గోపాలపల్లిలోని కూలిపోయిన బ్రిడ్జి, పాత చెరువు జలధార డి-1, 8వతూము, డి-1,5వతూములను పరిశీలించి మరమ్మత్తుల గురించి చర్చించినారు. ప్రధాన కాలువలో కలుస్తున్నటువంటి మురుగునీటి మీద విచారం వ్యక్తం చేసినారు.
