Breaking News

రూ.2000 నోట్ల మార్పిడిపై ఆర్బిఐ గవర్నర్ వ్యాఖ్యలు.

132 Views

*రూ.2వేల నోట్ల మార్పిడిపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు.*.ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.2 వేల నోట్లు మార్చుకోవడానికి తొందర పడొద్దని సూచించారు. రూ.2 వేల నోట్లు మార్పిడి కోసం నాలుగు నెలల సమయం ఉందని శక్తికాంతదాస్ తెలిపారు.సెప్టెంబర్ 30 తర్వాత కూడా 2వేల నోటు చెలామణి అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడే బ్యాంకులకు పోటెత్తాల్సిన అవసరం లేదని,ఇంకా నాలుగు నెలల సమయం ఉందని ఆయన అన్నారు. సెప్టెంబర్ 30వ తేదీనే ఎందుకు డెడ్‌లైన్‌గా పెట్టామన్న విషయాన్ని ఆయన చెబుతూ.ఆ తేదీని సీరియస్‌గా తీసుకుని ప్రజలు ఆ నోట్లను వెనక్కి ఇచ్చేస్తారన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత ఏర్పడిన లోటును పూడ్చేందుకు రెండు వేల నోట్లను ప్రవేశపెట్టినట్లు ఆర్బీఐ చీఫ్ తెలిపారు.2వేల నోట్లను వెనక్కి తీసుకునేందుకు కావాల్సిన అన్ని వసతుల్ని బ్యాంకులు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. అవసరమైనన్ని ఇతర డినామినేషన్ల కరెన్సీ నోట్లు అందుబాటులో ఉన్నాయని,ప్రస్తుతం అందుబాటులో ఉన్న నోట్ల కన్నా ఎక్కువ సంఖ్యలో ఆ నోట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఆ నోట్లను ప్రింట్ చేసినట్లు చెపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *