సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండెవెళ్లి గ్రామ ఏంపీటీసి, మాజీ ఎంపీపీ సీనియర్ నాయకురాలు మెరుపుల సరస్వతి అకాల మృతి పట్ల రాష్ట్ర మంత్రి హరీష్ రావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాజీ ఏంపీపీగా, ప్రస్తుత గ్రామ ఏంపీటీసీగా నిరంతరం కృషి చేస్తూ, చిన్నగుండవెళ్లి గ్రామంలోని వారి నివాసంలో ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అంతకు ముందు పట్టణంలోని ధోభీగల్లీలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇందూరు కళాశాల విద్యార్థి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు.




