వీధి కుక్కలను అటవీ ప్రాంతానికి తరలింపు…
ఎల్లారెడ్డిపేట ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్(జగదీశ్వర్)
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వీధి కుక్కలను వేటాడి పట్టుకొని ర్యాలీ ఆటోలో వేసి అటవీ ప్రాంతానికి తరలించారు వీధి కుక్కల బెడదతో పిల్లలపై పెద్దలపై దాడి చేసి కరుస్తుండడంతో కుక్కలా నివారణకు చర్యలు గ్రామపంచాయతీ సిబ్బంది చేపట్టారు వాటిని చంపి వేయకుండా సురక్షిత అటవీ ప్రాంతాలకు తరలించినట్టు సమాచారం దీంతోపాటు మండలంలో సీసీ కెమెరాల ఏర్పాటు కూడా చేయాలని ఎల్లారెడ్డిపేట మండల వాసులు కోరుతున్నారు అసాంఘిక కార్యకలాపాలు చేసే వారిపై నిఘా నేత్రాలు పనిచేస్తాయని చెబుతున్నారు దొంగల బెడద కూడా ఈ మధ్యలో తీవ్రతరం అయ్యింది కావున అభద్రతాభావంతో ఉండవద్దని పెద్ద మనుషులు,మండలవాసులు చెబుతున్నారు.
