మంచిర్యాల జిల్లాలో కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం.
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం ఈనెల 18వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత తెలియజేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటి సర్వే కార్యక్రమంలో 650 టీముల ద్వారా సుమారు రెండు లక్షల 12,500 ఇళ్లను సర్వే కార్యక్రమంలో చేపట్టినట్లు ఎనిమిది లక్షల జనాభాను ఈ సర్వే కార్యక్రమంలో అడుగుతున్నట్లు అదే విధంగా ప్రతి టీం లో ఆశా కార్యకర్త ఆయా కేటాయించిన ఇళ్లలో తిరుగుతూ కుష్టి వ్యాధి గురించి తెలియజేసి వాటి వివరములను తెలుసుకుంటున్నట్టు తెలియజేసినారు ముఖ్యంగా కుష్టు వ్యాధి మైకో బాక్టీరియం అని బ్యాక్టీరియా వల్ల వచ్చే అతి సామాన్యమైన వ్యాధి కుష్టు వ్యాధి ముఖ్యంగా చర్మానికి నరాలకు సోకుతుంది కుష్టు వ్యాధి చాలా నెమ్మదిగా పెరిగి వ్యాధి లక్షణాలను బహిర్గతం కావడానికి సుమారు మూడు సంవత్సరముల నుండి ఐదు సంవత్సరముల వరకు పడుతుంది కుష్టు వ్యాధి ఎవరికైనా రావచ్చును దీనికి వయసు లింగ బేధం లేదు కుష్టు వ్యాధి వంశపార్యపర్యం కాదు శాపము పాపము అంతకన్నా కాదు కుష్టు వ్యాధి ఆరు నెలల నుండి 12 నెలల్లో బౌల్ ఔషధ చికిత్స ద్వారా పూర్తిగా నయం అవుతుంది. కుష్టు వ్యాధి రోగులు పూర్తిగా సామాజిక జీవితం గడపవచ్చును ప్రారంభ దశలోని గుర్తించడం ద్వారా కుష్టు వ్యాధి అంగవైకల్యానికి దారి ఇయ్యదు. చికిత్స పూర్తయిన తర్వాత చికిత్స తీసుకుంటున్న రోగులలో అంగవైకల్యం ఉంటే శస్త్ర చికిత్స ద్వారా సరి చేయవచ్చును కావున ఆశ ఆరోగ్య కార్యకర్తలు ఈ క్రింది లక్షణాలు ఉన్నవారికి కుష్టు వ్యాధి మచ్చలు సహజ చర్మపురంగు కంటే తక్కువ లేదా ఏర్పూరు లేదా రాగి రంగు కలిగి ఉంటాయి మచ్చలపై స్పర్శ ఉండదు నొప్పి ఉండదు ఈ ప్రదేశములైన రావచ్చును కావున చర్మంపై ఏ రకమైన మచ్చ ఉండను మీ ఇంటికి వచ్చే ఆరోగ్య ఆశా కార్యకర్తలను సంప్రదించండి కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని కోరడమైనది మంచిర్యాల జిల్లాలో ఇప్పటివరకు 70 లెప్రసీ కేసులను గుర్తించి చికిత్సలు అందించడం జరుగుతున్నది కావున జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆశ ఆరోగ్య కార్యకర్తలు గ్రామాల్లో సందర్శించినప్పుడు కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించి అవగాహనా చికిత్సలు అందజేయాలని కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించిన తర్వాత వైద్యాధికారుల దగ్గరికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల దగ్గరికి పంపించాలని ఆదేశించినారు. ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమాల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పోస్టర్లను ప్లెక్సీలు కరపత్రాలను పంపిణీ చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అప్పల ప్రసాద్ డి పి ఎం ఓ రాఘవయ్య డిపిఓ ప్రశాంతి సుమన్ మార్త సిహెచ్ లింగారెడ్డి వెంకటేశ్వర్లు సంతోష్ బుక్ వెంకటేశ్వర జిల్లా మాస్ మీడియా అధికారి పాల్గొన్నారు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిధిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టుతున్నట్లు తెలియజేసినారు.





