అక్టోబర్ 9 తెలుగు న్యూస్ 24/7
రామగుండం పోలీస్ కమిషనర్ పరిధి పెద్దపల్లి జోన్ డిసిపి వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్ మరియు మంచిర్యాల జోన్ డిసిపి సుదీర్ కేకన్ ఐపిఎస్ లు మరియు పోలీసు అధికారులతో రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్ (డిఐజి) నేర సమీక్ష సమావేశం ను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత రెండు నెలల లో ఫంక్షనల్ వర్టికల్స్ లో ప్రతిభ కనబరిచిన 02-ఇన్స్పెక్టర్స్ ,15- ఎస్ ఐ లు,10 -ఎఎస్ఐ లు,27 -హెడ్ కానిస్టేబుల్,76- కానిస్టేబుల్ లకి రివార్డు మేళా నిర్వహించి రామగుండం పోలీస్ కమీషనర్ రేమ రాజేశ్వరి ఐపిఎస్ ప్రశంస పత్రం అందజేయడం జరిగింది.
