తిమ్మాపూర్ మండలనికి చెందిన 1397 మంది దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3016/- రూపాయల నుంచి 4016/- రూపాయల పెంచిన పింఛన్ ప్రొసీడింగ్ పత్రాలను తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి సాయిరాం ఫంక్షన్ హల్ లో మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడ 4016/- రూపాయల పింఛన్ది దివ్యాంగులకు పెంచలనే ఆలోచన చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు 3016 నుంచి 4016కు పెంచి, దివ్యాంగుల పాలిట దేవుడయ్యాడని కొనియాడారు.
దేశంలో 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టి 200 కంటే ఎక్కువ పెంచాలని ఆలోచన రాలేదన్నారు. దేశంలో కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రంలో 600 కంటే ఎక్కువ ఇవ్వటం చేత కాలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో 4000 రూపాయలు ఇస్తానని చెప్పటం విడ్డురమని అన్నారు..
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్, ఎంపీపీ కేతిరెడ్డి వనిత, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఇనుకొండ జితేందర్ రెడ్డి, మండల వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్ ఎలుక ఆంజనేయులు, ఆత్మ కమిటీ చైర్మన్ పాశం అశోక రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.