ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే10, ఇంటర్ ఫలితాలులో ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఎంపీసీ విద్యార్థి కంచర్ల ఉషశ్రీకి 470 గాను 461 విజయ ఢంఖా మోగించిన ఆ విద్యార్థికి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శాలువా బోకేతో సత్కరించారు. ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ కష్టపడి చదివి విజయపరంపరను కొనసాగించిన విద్యార్థినీ అభినందిస్తూ ముందు ముందు కష్టపడుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని అలాగే తల్లిదండ్రులకు చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈకార్యక్రమంలో బిసి విద్యార్థి నాయకుడు పాప వివాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
