ప్రాంతీయం

రైతు సంక్షేమే బి.ఆర్.యస్ ప్రభుత్వ లక్ష్యం – మునిసిపల్ చైర్మన్ గన్నే వనిత-భూమిరెడ్డి, కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి

118 Views

సిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపల్ చెల్లాపూర్ లోని రెండవ వార్డు పరిధిలో ఉన్న వడ్ల కేంద్రాల్లో కొనుగోలుని ఈ రోజు దుబ్బాక మునిసిపల్ చైర్మన్ గన్నే వనిత-భూమిరెడ్డి గారితో స్థానిక కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి గార్లు కొబ్బరికాయ కొట్టి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ గారు మాట్లాడుతూ ఈ సారి వడగండ్ల వానల వల్ల రైతులు చాలా నష్ట పోయినరు వారికి మా ప్రభుత్వం తరపున ఒక ఎకరాకు పది వేల ఇష్టం అని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన జిల్లా మంత్రి హరీష్ అన్న గారు,మన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి చెప్పి భరోసా ఇచ్చారు రైతుల సంక్షేమమే మన బి.ఆర్.యస్ ప్రభుత్వ పాలన ప్రతి వడ్ల గింజని మన రాష్ట్ర ప్రభుత్వం కొంటాది అని తెలిపారు ఈ కార్యక్రమంలో దుబ్బాక బి.ఆర్.యస్. సీనియర్ నాయకులు కృష్ణ,మునిసిపల్ కమిషన్ గణేష్ రెడ్డి,చెల్లాపూర్ విజయ పాల డైరీ చైర్మన్ చెరుకు బాలకిషన్,బి.ఆర్.యస్.వి జిల్లా విభాగ నాయకులు కొండే గోపాల్ రెడ్డి,వార్డ్ అధ్యక్షుడు దుబ్బాక రవి,సహదేవ రెడ్డి,ఒగ్గు రాములు,మెప్మా రేణుక,ఆర్పీ లావణ్య,సమాఖ్య సభ్యులు,రైతులు,హమాలలి మరియు వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *