హైదరాబాద్ లోని నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయంలో ఐఏఎస్ వ్యవసాయ మరియు సహకార ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ కలిసి అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో గల రైతులందరికీ ఉపయోగపడేలా గజ్వేల్ మార్కెట్ యార్డు నందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా భూసార పరీక్ష కేంద్రంను ఇటీవల గౌ మంత్రి వర్యులు హరీష్ రావు చేతులమీదుగా ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. కావున భూసార పరీక్ష కేంద్రం నందు తగిన సిబ్బందిని మరియు లాబరేటరీ పరికరములు సమకూర్చి రైతులందరికీ అందుబాటులో ఉండేవిదంగా ఆదేశాలు ఇవ్వవల్సిందిగా వారికి విన్నవించడం జరిగిందని అన్నారు. వారు సానుకూలంగా స్పందించడం జరిగిందని అన్నారు ..ఈ సందర్భంగా వారి వెంట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి ఉన్నారు..
