ముస్తాబాద్ ప్రతినిది వెంకటరెడ్డి మే6, మండలంలోని బట్టు నరసయ్య కూతురు వివాహానికి కనిమేని చక్రధర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి శనివారం రోజున క్వింటాల్ బియ్యాన్ని పంపిణీ చేశారు. కడు పేదరికంలో ఉన్న అతని కుటుంబ సభ్యులకు వారి కుటుంబానికి సాయంగా బియ్యం పంపిణీ చేసినట్లు వారు తెలియజేశారు. ఈచారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిజమైన పేదవారు బడుగు బలహీన వర్గాలు చేయూతనందించాలని ఈట్రస్టు నిర్మించామని తెలిపారు. ఈకార్యక్రమంలో ట్రస్టు అడ్వైజ్ మెంబర్ కస్తూరి కార్తిక్ రెడ్డి, మీసాశంకర్, బండి శ్రీకాంత్, మీసస్వామి, మద్దికుంట రమేష్, కటికె పద్మ, బండి రేణుక తదితరులు పాల్గొన్నారు.




