
జగదేవపూర్ మండల పరిధిలోని చాట్లపల్లి, తిగుల్ నర్సాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రలను శనివారం స్థానిక సర్పంచ్ రాచర్ల నరేష్, రజిత రమేష్ ఎంపీటీసీ కావ్య ధర్గయ్య లతో కలిసి రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం తిగుల్ నర్సాపూర్ లోని శ్రీ కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్,ఎంపీటీసీ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్,సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు నరేష్,ఆత్మ కమిటీ ఛైర్మన్ రంగారెడ్డి, మార్కెట్ వైస్ ఛైర్మన్ ఉపేందర్ రెడ్డి,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కో అప్షన్ ఎక్బల్, మాజీ సర్పంచ్ లక్ష్మణ్,నాయకులు స్వామి, కనకారెడ్డి, యాదగిరి, వివిధ కమిటీ డైరెక్టర్లు, శ్రీను,యాదగిరి, ఐలయ్య ,మండల నాయకులు అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




