ప్రాంతీయం

మద్యం మత్తులో వాహనం నడిపితే కటకటాలే.. పెట్టీ కేసుల్లో జైలు శిక్ష…

34 Views

మద్యం మత్తులో వాహనం నడిపితే కటకటాలే.. పెట్టీ కేసుల్లో జైలు శిక్ష…

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 4,తెలుగు న్యూస్ 24/7 

సిద్దిపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తికి కోర్టులో హాజరుపరిచారు. ఈ విచారణలో భాగంగా కోర్టు నిందితుడికి 5రోజులజైలుశిక్షవిధించడమైనది.నిందితుడికి జైలు శిక్ష: మిట్టపల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లో 5 రోజుల జైలుశిక్ష ,ఇప్పటివరకు 4 పెట్టి కేసులు ఉన్నందున బుధవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నందు హాజరు పరచగా మెజిస్ట్రేట్ 70 బి సీపీ యాక్ట్ లో అదనంగా మరో రెండు రోజులు కలిపి మొత్తం ఏడు రోజులు జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా సిద్దిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ మాట్లాడుతూ..మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, చలానాలు సకాలంలో చెల్లించాలని సూచించారు.ఇకపై పెట్టీ కేసుల్లో ఓపెన్ ప్రదేశాలలో మద్యంసేవించడం ,న్యూసెన్స్ చేయడం వాటిలో కూడా నిందితులను జైలుకు పంపడం జరుగుతుందని, కేవలం ఫైన్ తో వదిలిపెట్టకుండా, కఠిన శిక్షలు అమలు చేయడం ద్వారా నేరాల నియంత్రణే లక్ష్యంగాసిద్ధిపేటపోలీసులుపనిచేస్తున్నారని తెలియజేశారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *