ప్రాంతీయం

వృద్ధులకు ఆసరాగా నిలుద్దాం.. అన్నపూర్ణ ఫౌండేషన్…

114 Views

ముస్తాబాద్, జనవరి 30 (24/7న్యూస్ ప్రతినిధి) ఓట్లు రాగానే అభ్యర్థులు వాగ్దానాలు ఇవ్వడం సహజమే అయితే దీనికి భిన్నంగా గూడెం గ్రామంలో స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి కుర్ర సావిత్రి ఇంటింటా తిరుగుతూ ఓట్ల సమయంలో ఓటు వేయమని అడగగా తమతమ ఇంటి వద్దనున్న వృద్ధులు మాట్లాడుతూ ఓట్లప్పుడే వస్తారు ఏమేమో చెబుతారు. అనేకమైన వాగ్దానాలు చేస్తూ తరువాత మమ్మల్ని పట్టించుకునే వారు ఎవరని దీనంగా తెలిపినవారి మాటలకు స్పందించి కుర్ర సావిత్రి గూడెం గ్రామంలో సర్పంచ్ గా ఓడిపోయినప్పటికీ వృద్ధులకు, వికలాంగులకు కనీసం భోజనం పెట్టే వసతి ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మరికొందరు మహిళలను కలుపుకొని  మానవసేవే మాధవసేవ అనే మంచి ఉద్దేశంతో  సావిత్రితో పాటు 11,మంది మహిళలు గూడెం గ్రామంలో అమ్మ ఫౌండేషన్ పేరుతో సుమారుగా 45 నుండి 50 మంది వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు, వికలాంగులకు తమసొంత ఖర్చులతో ఎవరికి అవసరమైన ఆహారాన్ని వారి ఇంటి వద్దకు వెళ్లి రెండుపూటల భోజనం అందిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది దాతలు తమకు తోచినంత సహాయం చేస్తూ సహాయంలో భాగంగా బియ్యము కూరగాయలకు అలాగే పండ్లకు డబ్బులు ఇస్తున్నారని ఇంకెవరైనా దాతలు తమకు తోచినంత బియ్యంగాని డబ్బులుగానీ అందించి వృద్ధులను ఆదుకోవాలని కోరారు. మునుముందు ప్రభుత్వ పరంగా గాని స్వచ్ఛందంగా దాతలు ముందుకువచ్చి వృద్ధాశ్రమం కొరకు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *