బీఎస్పీ తెలంగాణ భరోసా సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.
గజ్వేల్: గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్ మాట్లాడుతూ హైదరాబాద్ సరూర్నగర్ గ్రౌండ్లో రేపు జరగబోయే తెలంగాణ భరోసా సభకు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మరియు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బెహన్ కుమారి మాయావతి గారు విచ్చేస్తున్న సందర్భంగా ఈ యొక్క బిఆరెస్ కుటుంబ పాలన నుంచి విముక్తి చేయడం కోసం విద్యార్థులు మరియు నిరుద్యోగులు మరియు రైతులకు పేదవాళ్లు యొక్క జీవితాల్లో వెలుగు నింపుటకు తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వడానికి వస్తున్నారు.కాబట్టి మాయావతి గారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు ఒక భరోసాగా నిలవాలని కోరుకుంటూ ఈ యొక్క సభను గజ్వేల్ నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వేలాది గా తరలివచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయవాల్సిందిగా కోరుతున్నాము





