మంచిర్యాల జిల్లా.
తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అసెంబ్లీ పరిధిలో, ప్రచార సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ పాల్గొని బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి షేక్ పేట్ డివిజన్లో గల బూత్ నెంబర్ 14 సీతనగర్ ఎన్నికల ఇన్చార్జి కోటపల్లి మండల బిజెపి పార్టీ మాజీ అధ్యక్షులు మంత్రి రామయ్య, మరియు బూతు నెంబర్ 14 అధ్యక్షులు మహేందర్ ఆధ్వర్యంలో 220 మంది మహిళలను పురుషులను తరలించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వేమనపల్లి మండల బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి కొప్పుల చరణ్ రాజ్ మరియు స్థానిక సీతానగర్ కాలనీ నాయకులు రాజేష్, బాలకృష్ణ, మహేందర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





